Home తాజా వార్తలు పరిహారం విషయంలో స్పష్టత వచ్చింది: ఈటెల

పరిహారం విషయంలో స్పష్టత వచ్చింది: ఈటెల

eetelaన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఏడో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… పరిహారం విషయంలో ఓ స్పష్టత వచ్చిందని అన్నారు. ప్రతి రెండు నెలలకోసారి రాష్ట్రాలకు పరిహారం చెల్లించేలా కేంద్రం అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. ఐజిఎస్‌టిపై కేంద్ర, రాష్ట్రాల అధికారంపై ఇంకా చర్చజరగాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల కొత్త నోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ. 20,700 కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. ఇకపై చిన్న నోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి చెప్పారు.