Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

18న ఇ-వే, లాటరీలపై జిఎస్‌టి కౌన్సిల్ భేటీ

GSTన్యూఢిల్లీ: జిఎస్‌టి కౌన్సిల్ ఈనెల 18న మరోసారి సమావేశం కానుంది. ఈ భేటీలో లాటరీపై పన్ను రేట్లు అలాగే ఇ-వే బిల్లు వంటి అంశాలపై చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు. ఆర్థికమంత్రి అరుణ్  జైట్లీ ఆధ్వర్యంలో రాష్ట్రాల ప్రతినిధులతో జిఎస్‌టి కౌన్సిల్‌కు ఇది 17వ సమావేశం కానుంది. కౌన్సిల్ ఇప్పటికే అన్ని వస్తువులకు రేట్లను ఖరారు చేసింది. జిఎస్‌టి అమలును రెండు నెలలపాటు వాయిదా వేయాలని పౌరవిమానాయానశాఖ కోరుతోంది.  జూలై 1 నుంచి జిఎస్‌టిని అమలోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. జిఎస్‌టిని అమలుచేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని, సెప్టెం బర్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని కోరుతూ కేంద్రానికి పౌరవిమా నాయానశాఖ లేఖ రాసింది. ఇప్పటికిప్పుడు విమానాయాన సంస్థలు జిఎస్‌టిని అమలుచేయలేవని, తమకు మినహాయిం పునివ్వాలని కోరుతున్నాయని ఆ శాఖ పేర్కొంది. కాగా జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలు ఆలస్య మయ్యే అవకాశాలున్నాయంటూ వస్తున్న వదంతు లను కేంద్రం ఖండించింది. అనుకున్న ప్రకారమే జులై 1 నుంచి జిఎస్‌టి అమలు చేస్తామని పేర్కొంది. అతిపెద్ద సంస్కరణ అయిన జిఎస్‌టిని వచ్చే నెల నుంచి సజావుగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ కార్యదర్శి హ ష్ముఖ్ అధియా అన్నారు.  వచ్చే మూడో వారాల్లో జి ఎస్‌టిని అమలు చేసేందుకు ప్రభుత్వ సిద్ధమ వుతున్న నేపథ్యంలో పరిశ్రమలో వివిధ వర్గాలు, కొన్ని రాష్ట్రాలు వాయిదా వేయాలని కోరుతున్నాయి. అమలు సంబంధించి అంతా సిద్ధం కాలేదని వారం టున్నారు. జులై 1 నుంచి అమలు చాలా కష్టమని, అమలుకు ఒక నెల గడువు ఆగస్టు 1 వరకు పెంచా ల్సి ఉంటుందని జూన్ 11న జిఎస్‌టి కౌన్సిల్ సమా వేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా వ్యాఖ్యానించారు. జిఎస్‌టి అమలుకు సంబంధించి సన్నాహాలు వేగంగా జరుగుతున్నా యని, సిబిఇసి(కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు) సహ కారంతో ప్రభుత్వం పనులు చేపట్టిందని అన్నారు. ఈ జిఎస్‌టిని నాలుగు స్లాబ్‌లతో పన్నును కౌన్సిల్ ఖరారు చేసింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఉండాలి కనుక జిఎస్‌టిని సి-జిఎస్‌టి, ఎస్-జిఎస్‌టిగా కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి అన్ని రకాల వస్తువులకు రేట్లను ఖరారు చేసి.. రేట్లను నిర్ణయించిన విషయం తెలిసిందే.

Comments

comments