Home తాజా వార్తలు వాటిపై జిఎస్‌టిని రెండేళ్ల పాటు మినహాయించాలి

వాటిపై జిఎస్‌టిని రెండేళ్ల పాటు మినహాయించాలి

                       Minister Eetela Rajender

హైదరాబాద్: తెలంగాణ తరుపున 33 అభ్యంతరాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ అభ్యంతరాలను జిఎస్‌టి కౌన్సిల్ ముందు ఉంచుతామని వెల్లడించారు. ప్రాజెక్టులపై జిఎస్‌టిని రెండేళ్ల పాటు మినహాయించాలని కోరుతామన్నారు. గ్రానైట్, బిడి, టెక్స్‌టైల్ వంటి రంగాల నుంచి విన్నపాలు వచ్చాయని, వాటిని కూడా జిఎస్‌టి కౌన్సిల్ ముందు ఉంచుతామని వివరించారు. హైదరాబాద్ లో శనివారం 21వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది