Home రాష్ట్ర వార్తలు హైదరాబాద్‌లో నేడు జిఎస్‌టి భేటీ

హైదరాబాద్‌లో నేడు జిఎస్‌టి భేటీ

5% నష్టాన్ని తగ్గించాలని, చట్టానికి కొన్ని సవరణలు చేయాలని కోరనున్న రాష్ట్రం
సాయంత్రం ఫలక్‌నుమా హోటల్‌లో జైట్లీ ప్రభృతులకు విందు
హెచ్‌ఐసిసిలో సమావేశ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఈటల

Etelaహై-దరాబాద్ : జిఎస్‌టి అమలుతో రాష్ట్రానికి నష్టం ఉందని ఇప్పటికే కేంద్రానికి తెలియచేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నూతన విధానం అమలుతో కలిగే ఐదు శాతం నష్టం తగ్గించాలని, కొన్ని సవరణలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. హెచ్‌ఐసిసిలో శనివారం నిర్వహించనున్న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 2వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరుగుతోందని చెప్పారు.  జిఎస్‌టి కౌన్సిల్‌లో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. జిఎస్‌టి వల్ల లాభమా, నష్టమా అనేది వచ్చే నెలలో స్పష్టత వస్తుంది. ఐజిఎస్‌టి అనేది ఇంకా తెలంగాణకు రాలేదు. దేశంలోని చాలా రాష్ట్రాలకు రాలేదు. ఓటింగ్ సమయంలో ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కరే పాల్గొంటారు. ఈ కౌన్సిల్ సమావేశం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. జిఎస్‌టిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సిఎం కెసిఆర్ నాతో పాటు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి టి.హరీశ్ రావుకు బాధ్యతను అప్పగించారన్నారు. కౌన్సిల్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై కడియం శ్రీహరి, హరీశ్ రావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.సింగ్ తనతో చర్చించారన్నారు. జిఎస్‌టి అమలుతో ఏ శాఖకు ఎంతమేర నష్టం జరుగుతుందనే దానిపై చర్చించి సమగ్ర నివేదిక సిద్ధం చేశామన్నారు కౌన్సిల్ సమావేవానికి ముందు మంత్రుల సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల డిమాండ్లను చర్చిస్తామన్నారు.  ప్రస్తు త పన్ను విధానం వల్ల తెలంగాణకు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందన్నారు.  కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు అతిథులకు శనివారం రాత్రి ఫలక్‌నుమా హోటల్‌లో విందు ఇస్తున్నామని ఈటల తెలిపారు.