Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణకు జిఎస్‌టి సభ్యత్వం:ఈటల

Etela

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్టి మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక చేయూతను అందివ్వాల్సిందిగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు మంత్రి ఈటల తెలిపారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అభిప్రాయాలను జైట్లీ అడిగినట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రధాన్యత ఇవ్వాలన్నామని, మిషన్ భగీరథకు రూ.19780 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల సాయంపై కేంద్ర మంత్రి జైట్లీకి గుర్తుచేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా 30 జిల్లాల్ని వెనుకబడినవిగా గుర్తించి నిధుల్వివాలని కోరామన్నారు. కాగా రాష్ట్రం తరపున అడిగిన అన్నింటికీ జైట్లీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీడీలపై ఉన్న 28 శాతం శ్లాబ్‌ను ఈసారి కూడా తగ్గింలేదన్నారు.అయితే డ్రిప్ ఇరిగేషన్ వస్తువులకు మాత్రం జిఎస్టి రేటు 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణకు జిఎస్‌టి సభ్యత్వం ఇచ్చినట్లు మంత్రి ఈటల వెల్లడించారు.

Comments

comments