Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి రేటు తగ్గింపు

jai

29 వస్తువులు, 53 సేవలపై జిఎస్‌టి రేటు తగ్గింపు

 జనవరి 25 నుంచి అమల్లోకి కొత్త రేట్లు
 ఫిబ్రవరి 1 నుంచి ఇవే బిల్లు అమల్లోకి తెస్తాం
 జిఎస్‌టి కౌన్సిల్ భేటీ అనంతరం జైట్లీ వెల్లడి

న్యూఢిల్లీ : జిఎస్‌టి కౌన్సిల్ గురువారం నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో 29 వస్తువులు, 53 సేవలపై పన్ను రేటును తగ్గించింది. చిన్న వ్యాపారాలకు భారం తగ్గించేందుకు జిఎస్‌టి రిట ర్న్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయాలనే అంశంపై బేటీలో చర్చించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ జిఎస్‌టి కౌన్సిల్ సమా వేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజర య్యారు. ఫిబ్రవరి 1 నుంచి ఇ-వే బిల్లును అమల్లోకి తీసు కురానున్నామని జైట్లీ తెలిపారు. పన్నును తగ్గించిన 29 వస్తువుల్లో ప్రధానంగా హస్తకళల వస్తువులున్నాయి. 29 రకాల హస్తకళ వస్తువులను సున్నా శాతం శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించామని అన్నారు. అలాగే 49 వస్తువులపై పన్ను తగ్గించామని సమావేశం అనంతరం జైట్లీ తెలిపారు. మార్పులు చేసిన జిఎస్‌టి రేట్లు జనవరి 25 నుంచి అమ ల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్యానెల్ ఈ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రిటర్న్‌లు, ఫైలింగ్ ప్రక్రియను సులభతరం, ఇవే బిల్లు కూడా ఫిబ్రవరి 1 నుంచి కచ్చితంగా అమల్లోకి తేవాలనే అంశంపై అధికా రులు తెలిపారు. బీడీలపై జిఎస్‌టి తగ్గించాలని కోరినా, కౌన్సిల్ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపై మాత్రం జిఎస్‌టిని 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపునకు ఆమోదం లభించిందన్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తు లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చించ లేదు. వచ్చే జిఎస్‌టి సమావేశం తేదీని ఇంకా ఖరారు చేయలదేని జైట్లీ తెలిపారు.
జిఎస్‌టి కౌన్సిల్ భేటీ ముఖ్యాంశాలు
29 వస్తువులు, 53 సేవలకు రేట్లను సవరించారు.
జనవరి 1 నుంచి ఇ-వే బిల్లు వ్యవస్థ పరీక్ష జనవరి 25 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 1 నుంచి ఇవే బిల్లును అమల్లోకి రానుంది.
3బి రిటర్న్ దాఖలు కొనసాగవచ్చు. సరఫరా దారు లు ఇన్వాయిస్‌లను కొనసాగించవచ్చు.
15 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ఇ-వే బిల్లుపై అంగీకారం తెలిపాయి.
పెట్రోలియం ఉత్పత్తులపై నిర్ణయం వాయిదా పడింది.
రియల్ ఎస్టేట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.
29 హస్తకళ వస్తువులను 0 శాతం శ్లాబ్‌లోకి తెచ్చారు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా జిఎస్‌టి రేట్లను తగ్గించారు.
కొనుగోళ్ల ఇన్‌వాయిస్‌లు, విక్రేతల ఇన్‌వాయిలు అప్‌లోడ్‌పై జిఎస్‌టి కౌన్సిల్ చర్చించింది. ఈ పథకం క్రింద 307 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే  సుమారు 40 హస్తకళ వస్తువులకు రేట్లను ఫిట్మెంట్ కమిటీ నిర్థారించనుంది. ఈ జాబితాకు మరికొన్ని వస్తువులను చేర్చవచ్చు. వచ్చే సమావేశంలో కొన్ని వస్తువులపై చర్చ నిర్వహించనున్నారు. రూ.35 వేల కోట్ల ఉమ్మడి జిఎస్‌టిని.. కేంద్రం, రాష్ట్రాల మధ్య విభజించనున్నారు.

Comments

comments