Search
Friday 16 November 2018
  • :
  • :

జిఎస్‌టిఆర్ గడువు పొడిగింపు

* జిఎస్‌టి-2కు నవంబర్ 30, జిఎస్‌టిఆర్-3కు డిసెంబర్ 11

* రెండింటికి నెల రోజుల సమయం ఇచ్చిన ప్రభుత్వం

GSTR

న్యూఢిల్లీ:వ్యాపార సంస్థలు, పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటును అందించే ప్రయత్నంలో భాగం గా జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) ఫైలింగ్‌కు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కొత్త జిఎస్‌టిఆర్2, జిఎస్‌టిఆర్3లకు నెల రోజుల చొప్పున గడువును ప్రభుత్వం పెంచింది. జులైలో కొనుగోళ్లు, ఇన్‌పుట్, అవుట్‌పుట్ లావాదేవీల కోసం జిఎస్‌టి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. జిఎస్‌టి -2 రిటర్న్‌కు నవంబర్ 30, జిఎస్‌టిఆర్-3 దాఖలుకు చివరి తేదీ డిసెంబర్ 11 వరకు గడువును పొడిగించినట్టు ట్విట్టర్‌లో వెల్లడించింది. అక్టోబర్28న బెంగళూరులో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వాస్తవానికి జిఎస్‌టిఆర్2 అక్టోబర్ 31కల్లా దాఖలు చేయాలి. కాగా జిఎస్‌టిఆర్3 (జిఎస్‌టిఆర్1,2తో సరిపోలేవి)ని నవంబర్ 11కల్లా దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఈ గడువు ను నెలరోజులకు ప్రభుత్వం పొడిగించింది. ఈ గడువు పొ డిగింపు 30.81 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడనున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. జులైకు సంబంధించిన జిఎస్‌టిఆర్2ను శనివారం నాటికి 12 లక్షల మంది వ్యాపారులు దాఖలు చేశారు. ఆదాయం పన్ను రిటర్న్‌లను ఆడిట్ చేసేందుకు జిఎస్‌టిఆర్2 గడువు పన్ను చెల్లింపుదారులకు కొంత ఆందోళన కలిగించిందని, ఇప్పుడు సమయం ఇవ్వడంతో ఊరట కలిగిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. జిఎస్‌టి వ్యవస్థలో జిఎస్‌టిఆ2అత్యంత ముఖ్యమైంది.. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లభ్యత దీనిపైనే ఆధారపడి ఉంటుంది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ నేతృత్వంలో మంత్రివర్గం అక్టోబర్ 28న జిఎస్‌టిపై సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం జిఎస్ టిఆర్ గడువులను పొడిగించాలనే నిర్ణయానికి వచ్చింది. జిఎస్‌టిఆర్‌పై ఆందోళన చెందుతున్న చెల్లింపుదారులకు ఈ నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది.

Comments

comments