Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో ‘గూఢచారి’ సందడి

cn

‘క్షణం’ వంటి ట్రెండ్‌సెట్టింగ్ మూవీ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా… తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ “ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్‌తో ‘గూఢచారి’ తెరకెక్కుతోంది. ఢిల్లీ, ఫూణే, హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, చిట్టగాంగ్‌లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలోని కాస్కేడ్ మౌంటేన్స్‌లో జరుగుతోంది. అక్కడి అందమైన, అత్యద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః షానిల్ డియో, సంగీతంః శ్రీచరణ్ పాకాల, మాటలుః అబ్బూరి రవి, ఎడిటర్‌ః గ్యారీ బి.హెచ్.

Comments

comments