Search
Wednesday 21 November 2018
  • :
  • :

హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా…

Gudachari

‘క్షణం’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం “గూఢచారి’. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్‌లపై రూపొందించిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల సమంత రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సుప్రియ, రవిప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నాని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడివి శేష్, శోభిత, శశికిరణ్, అబ్బూరి రవి, అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్, అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.

Comments

comments