Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు

Untitled-1మహబూబ్‌నగర్: గుడుంబా తయారు చేసినా, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టికె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్‌పి. విశ్వప్రసాద్‌తో కలిసి గుడుంబా నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, తాండల్లో గుడుంబా తయారు చేసే వారిని గుర్తించి పోలీసుల సహాయంతో దాడులు నిర్వహించాలని తెలిపారు. గుడుంబా విషయంలో తాండల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. తరుచుగా విక్రయించే వారిని గుర్తించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయాలని తెలిపారు. గుడుంబా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకు కళాజాతలను వినియోగించుకోవా లన్నారు. జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చడానికి పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పొరుగు రాష్ట్రాల ఉంచి నల్లబెల్లం విక్రయాలపై నిఘా ఉంచాలని, చెక్ పోస్టులను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

గుడుంబా రక్కసికి బలయ్యే వారు నిరుపేదలు, బలహీన వర్గాలేనని, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, ప్రభుత్వ అధికారులు కలిసికట్టుగా గుడుంబా అనర్ధాల గురించి వివరించాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 321 గుడుంబా రహిత గ్రామాలు గా గుర్తించినట్లు, జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్షమని తెలిపారు. గుడుంబా ఫిర్యా దులకు టోల్ ఫ్రీ నెం. 18004252 553 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎస్‌పి విశ్వప్రసాద్ మాట్లాడుతూ గుడుంబా విక్రయదారులపై దాడులు నిర్వహిస్తు న్నామని ఇదే స్పూర్తితో కొనసాగిస్తామ ని తెలిపారు. పోలీసు శాఖ తరపున సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్, డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ, డిఎంహెచ్‌ఓ గోవిందువాగ్మోరే, డిసిహెచ్ మీనాక్షిపాల్గొన్నారు.

Comments

comments