Home జాతీయ వార్తలు గిన్నిస్ బుక్‌ఆఫ్ రికార్డుకెక్కిన కూచిపూడి నృత్యం

గిన్నిస్ బుక్‌ఆఫ్ రికార్డుకెక్కిన కూచిపూడి నృత్యం

GBWRవిజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర, భాషా సాంస్కృతికశాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీ య కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కెక్కింది. 6,117 మంది కళాకారిణులు ప్రదర్శించిన మహాబృందనాట్యం అద్యం తం ఆకట్టుకుంది. నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకా రులు హాజరయ్యారు. నాట్య ప్రదర్శన ముగిసిన అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎపి మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎపి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, కృష్ణాజిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ, నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.