Home అంతర్జాతీయ వార్తలు గిన్నీస్‌లోకెక్కిన గ్రీనెస్ట్ డాగ్ కన్నుమూత

గిన్నీస్‌లోకెక్కిన గ్రీనెస్ట్ డాగ్ కన్నుమూత

Dogలండన్: ‘వరల్డ్ గ్రీనెస్ట్ డాగ్’గా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న టబ్బీ అనే శునకం 13వ ఏట కన్నుమూసింది. బ్రిటన్‌లోని టోర్ఫేన్ ప్రాంతానికి చెందిన లాబ్రడార్ జాతి శునకం బయటకు వెళ్లినప్పుడల్లా ప్లాస్టిక్ బాటిల్స్ నోటితో పట్టుకుని వచ్చి యజమానికి ఇచ్చేది. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేసేవారు. 26వేల ప్లాస్టిక్ బాటిల్స్‌ను సేకరించినందుకు గాను ఈ శునకానికి 2011లో ‘వరల్ గ్రీనెస్ట్ డాగ్’ టైటిల్‌తో గిన్నిస్ రికార్డు దక్కింది. టబ్బీ మరణ వార్త తెలిసిన గిన్నిస్ వరల్ రికార్డ్స్ విచారం వ్యక్తంచేసింది. టబ్బీ రికార్డు ప్రత్యేకమైనదని గిన్నిస్ బుక్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టబ్బీ తన జీవితకాలంలో సుమారు 50వేల ప్లాస్టిక్ బాటిల్స్‌ను సేకరించినట్లు దాని యజమాని వెల్లడించారు.