Search
Friday 16 November 2018
  • :
  • :

గిన్నిస్‌కెక్కిన ప్రపంచపు అతిపెద్ద రవిక

world's-largest-blouseబెంగళూరు: నగరానికి చెందిన అనురాధ ఈశ్వర్ అనే మహిళ రూపొందించిన రవిక ప్రపంచంలోనే అతిపెద్ద రవికగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఐదుగురు ఈ రవికను కుట్టడానికి 72 గంటలపాటు కష్టపడ్డారు. 30 అడుగుల ఎత్తు, 44 అడుగుల వెడల్పుతో రవికను తయారుచేశారు. దీనికోసం 280 మీటర్ల కాటన్ బట్ట(డిజైన్‌తో కూడినది), 20 మీటర్ల ఆరెంజ్ రంగు పాలీస్టర్ బట్టను పైపింగ్ కోసం వాడారు. స్టిచింగ్ పూర్తైన అనంతరం బెంగళూరులోని నగారాభావిలోగల సెయింట్ సోఫియా కాన్వెంట్ హైస్కూల్‌లో ప్రదర్శనకు ఉంచారు. కాగా, ఈ జాకెట్ ప్రపంచలోనే అతిపెద్ద రవికగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం.

Comments

comments