Home అంతర్జాతీయ వార్తలు 9000 వేల తలపాగాలతో ‘గిన్నిస్ రికార్డు’

9000 వేల తలపాగాలతో ‘గిన్నిస్ రికార్డు’

sikku123
న్యూయార్క్: అమెరికాలోని సిక్కులు కొన్ని గంటల వ్వవధిలో 9000 వేల తలపాగాలు ధరించి గిన్నిస్ రికార్దును సొంతం చేసుకున్నారు. సిక్కులు ఎంతో పవిత్రంగా జరుపుకునే వైశాఖిని పురస్కరించుకొని తలపాగాల దినోత్సవాన్ని శనివారం జరుపుకున్నారు. 9000 వేల తలపాగాలను కొన్ని గంటల్లో చుట్టుకొని గిన్నిస్ రికార్డు సాధించడం గొప్ప అనుభూతిని కలిగించింది’ అని సిక్కుల ఎన్జిఓ వ్యవస్థాపకుడు చరణ్‌ప్రీత్ సింగ్ అన్నారు. వీరు రకరకాల తలపాగాలతో టైమ్స్ స్వేర్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమం అమెరికన్లను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. 9/11 దాడులు జరిగినప్పటి నుంచి తలపాగ ధరించిన వారిని అనుమానంతో చూడటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. న్యూయార్క్‌లో 2013 నుంచి తలపాగల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.