Home దునియా గిన్నిస్‌బుక్‌లో దీపకాంతులు

గిన్నిస్‌బుక్‌లో దీపకాంతులు

Sai Deepak Patel

పుట్టి పెరిగింది కళాకారులకు స్థావరంగా చెప్పుకునే  కృష్ణానగర్‌లో. కృష్ణానగరంటే సినిమా కళాకారులే కాదు  ఇంకా ఎన్నో  కళలకు నిలయం అంటూ  తనూ  ఓ కళను ఎంచుకున్నాడు. అదే సాహస క్రీడ తైక్వాండో.  ఈ ఆటలో బహుమతులే కాదు. గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పి రాబోయే 20-20 ఒలింపిక్స్‌లో ఆడటమే నా లక్షం అంటున్నాడు మన హైదరాబాద్ కృష్ణానగర్‌కు చెందిన దీపక్.

వరల్డ్ గిన్నిస్ రికార్డు కొట్టినందుకు ఎలా ఫీలవుతున్నారని అడగ్గా…
ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. చాలా సంతోషంగా ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు కొడతానని అనుకోలేదు. నన్ను ప్రోత్సహించిన మా పిఈటి , కోచ్ సార్లందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే నా కష్టం ఎంతుందో నేను ఈ రికార్డులు సాధించడానికి కోచ్‌ల, కుటుంబ ప్రోత్సాహం అంతే ఉంది. తప్పకుండా 20,-20 ఒలంపిక్స్‌లో ఆడతానని ఆత్మవిశ్వాసం ఉంది. అదే దిశగా ప్రాక్టీస్ చేస్తున్నాను.

తైక్వాండో ఆట మీద ఆసక్తి ఎలా కలిగింది…
చిన్నప్పటి నుండి అంటే నా సెకండ్ క్లాస్ నుండే నాన్న ఎక్కువగా బ్రూస్‌లీ మార్షల్ ఆర్ట్ సినిమాలు చూపిస్తుండేవారు. మా పెద్దనాన్న వాలీబాల్ ప్లేయర్ పోలీస్ ఆఫీసర్ కూడా. మా కుటుంబం నుంచే క్రీడల పట్ల ప్రోత్సాహం ఉండేది. రెండో తరగతి చదువుతున్నప్పుడే కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా ఇంటర్ వరకూ కరాటే పోటీలకు వెళ్తుండేవాణ్ణి. అప్పుడు ఇంటర్ లో ఉన్నప్పుడు తైక్వాండో మాత్రమే ఒలింపిక్స్‌లో ఉంది. మిగతావి లేవు అని కాబట్టి నువ్వు తైక్వాండో నేర్చుకుంటే బాగుంటుందని పిఈటీ సార్ చెప్పారు. అలా అప్పటి నుండి ఈ ఆటను ఎంచుకున్నాను.

ఈ ఆట చాలా ప్రమాదకరం, ప్రాణాలు పోయే ఆవకాశాలు ఉంటాయి కదా?
అవును కొన్ని సార్లు దెబ్బలు తగిలి గాయాలవడమే కాదు. ప్రాణాలు పోవచ్చు. ఈ ఆట ఆడటానికి చాలా ధైర్యం ఉండాలి లేక పోతే దీంట్లో నిలదొక్కుకోలేం. నేను మరీ పెద్దగా ఎప్పుడూ గాయపడలేదు. ఎందుకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే గేమ్‌కు వెళ్తా. అయితే ఒక ఈవెంట్‌లో నేను గాయపడి చాలా రోజులు గేమ్‌కు దూరమయ్యాను. కుటుంబ సభ్యులు వద్దని మానేయమన్నారు. ఒక సారి మా కాలనీ రోడ్డుమీద నుండి చిన్న పిల్లలు తైక్వాండో బట్టలు వేసుకుని పరిగెత్తుతుంటే చూసి వాళ్ల వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లా. అక్కడ గ్రాండ్‌మాస్టర్ కోచ్ జయంత్‌రెడ్డి ఉన్నారు అయనను కలిసి మళ్లీ గేమ్‌లోకి ఎంటరయ్యాను.

ఇప్పటి వరకూ పాల్గొన్న ఈవెంట్స్, రికార్డుల గురించి..
ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2017 టోర్నమెంట్, ఖాట్మండూ, నేపాల్‌లో జరిగింది. దానికి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించాను. 2017 ఏప్రిల్ 30న గిన్నిస్ ప్రపంచ రికార్డు J.R. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడెమీలో ఉన్నప్పుడు,మార్షల్ ఆర్ట్‌లో ప్రపంచ రికార్డుల రికార్డులో వరల్డ్ రికార్డు ఒక నిమిషం సింగిల్ లెగ్‌తో 273 కిక్కులు, అక్టోబర్ 2 న గాంధీ జయంతికి జరిగింది. 2016–,18 మేలో ఇండియన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ 2017 లో ‘కుకివోన్ కప్‘ లో 5 వ స్థానం. టాటాటోటా ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీలో జరిగిన 10 కౌంటూస్‌లో పాల్గొన్నాను. తెలంగాణ, ఆంధ్రపదేశ్ డైరెక్టరేట్ ఉత్తమ టెక్నికల్ స్క్వాడ్రన్ కంటైనెంట్ కమాండర్ నేషనల్ రైఫిల్ షూటింగ్ లో పాల్గొనేందుకు, కర్ణాటక గవర్నర్ గౌరవార్ధం గార్డులో పాల్గొనడానికి ఎంపికయ్యాను.

రాష్ట్రస్థాయిలో సెక్యూడ్ జె.ఆర్.ఆర్ జి.పి. కమాండింగ్ కమాండర్ వాయు సైనిక్ క్యాంప్ రాష్ట్ర స్థాయి డ్రిల్ ఉత్తమ సాంకేతిక స్క్వాడ్రన్ ట్రోఫీలను గెలుచుకున్నాను. NCC( -C ) సర్టిఫికెట్ పొందాను. దక్షిణ కొరియా కుకివాన్ వరల్డ్ తైక్వాండో హెడ్క్వాట్రెస్ నుండి తైక్వాండ్ బ్లాక్ బెల్ట్ AN-1 సర్టిఫికెట్ పొందాను. ఆంధ్రప్రదేశ్లోని 58 వ-మీస్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో 9. కాంస్య పతకాన్ని సాధించా. స్పోర్ట్ కోటాలో ఇంజనీరింగ్ సీటు పొందాను. JNTUH సెంట్రల్ జోన్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ -2014 లో కాలేజ్ వైస్ కెప్టెన్ గా ‘ఓపెన్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్, ఒక సారి జాతీయ అవార్డు, మూడు-సార్లు రాష్ట్ర పతక విజేతగా నిలిచాను.

పార్లమెంటు సభ్యుడు చి.మల్లారెడ్డి, అప్పటి తెలంగాణ డిప్యూటీ సిఎం డాక్టర్ రాజయ్య నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాను. ప్రతిష్టాత్మక భారత వైమానిక దళ హెలికాప్టర్ MI-17 లో ప్రయాణించే అవకాశం ఇచ్చారు. ‘మొదటి తెలంగాణ రాష్ట్ర రిపబ్లిక్ డే వేడుకల్లో‘ పాల్గొన్న కమాండర్గా ఎయిర్ఫోర్స్ అధికారి గ్రూప్ కెప్టెన్ పి.వెంకటేశ్వర్లు నుంచి ఉత్తమ క్యాడెట్ పోటీలో బంగారు పతకాన్ని, నగదు బహుమతి అందుకున్నాను. 2018, వరల్డ్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2019, 20,20 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగలనని ఆత్మవిశ్వాసంతో గత 2 సంవత్సరాలుగా నేను గ్రాండ్ మాస్టర్ ఎమ్. జయంత్ రెడ్డి సార్ దగ్గర జెఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్నాను.

బొర్ర శ్రీనివాస్

Guinness World Record of Sai Deepak Patel

telangana latest news