Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గాయకుడిపై కాంగ్రెస్ ఎంఎల్‌ఎ నోట్ల వర్షం..!(వీడియో)

Gujarat Congress MLA Alpesh Thakur showers money in Patan

అహ్మదాబాద్: గుజరాత్‌లోని పటాన్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎ అల్పేష్ థాకూర్ ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించారు. డైరో అనే పేరుతో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అల్పేష్ ఇలా రూ. 10 నోట్లను విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయమై ఎంఎల్‌ఎ మాట్లాడుతూ… తనకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) నియమాలు బాగా తెలుసని, తాను విసిరిన డబ్బును ఆడ పిల్లల చదువు కోసం వాడునున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Comments

comments