Home ఛాంపియన్స్ ట్రోఫీ గుజరాత్ లయన్స్ బోణీ

గుజరాత్ లయన్స్ బోణీ

Gujarat Lions won on Rising Pune Supergiant in IPL10

రాజ్‌కోట్: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బోణీ కొట్టింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన డిఆర్ స్మిత్ (47), మెక్‌ల్లమ్ (49) పరుగులు సాధించి మంచి శుభారంభాన్ని అందించారు. అనంతరం జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ సురేశ్ రైనా నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించి విజయతీరాలకు చేర్చాడు.

దీంతో 7 వికెట్ల తేడాతో పుణెపై లయన్స్ విజయం సాధించింది.172 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన లయన్స్ జటు ్ట18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి పుణెను మట్టికరిపించింది. మిగ తా ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ (3)పరుగులు చేయగా, ఫించ్ (33), సురేశ్ రైనా (35) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరా త్‌కు రెండు పాయింట్లు దక్కగా, పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఆండ్రూ టైకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అదరహో ఆండ్రూ టై..

అంతకముందు పుణె జట్టు బ్యాటింగ్ చేపట్టగా, గుజరాత్ లయన్స్ బౌలర్ ఆండ్రూ జెమ్స్ టై అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లను పడగొట్టిన టై.. పుణె ఆటగాళ్ల దూకుడును స్వల్ప స్కోరుకే కట్టడి చేశాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన పుణె జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠీలు భారీ స్కోరు సాధించేందుకు యత్నించారు. కానీ, బౌలింగ్ విభాగంలో రాణిస్తున్న లయన్స్ బౌలర్లు వారి దూకుడుకు కళ్లెం వేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పుణె 171 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా పుణె ఓపెనర్లుగా రహానె (౦), త్రిపాఠి (33) టై బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టు పగ్గాలు అందుకుని దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, 9 ఓవర్లలో డిఆర్ స్మిత్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి (43) పరుగులకే మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. స్టోక్స్ 25 పరుగులకే టై బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో కేవలం 5 పరుగులకే ఎల్‌బిడబ్లుగా ధోనీ వెనుదిరిగాడు. మిగతా ఆటగాళ్లు అంకిత్ శర్మ (25), మనోజ్ తివారీ (31) పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఫెర్గూసన్ (1), చాహర్ (3) నాటౌట్‌గా నిలిచారు.

గుజరాత్ ఇన్నింగ్స్: డిఆర్ స్మిత్ (సి) చాహర్ (బి) శార్దూల్ ఠాకూర్ ; 47, మెక్‌ల్లామ్ స్టం ప్ ధోనీ (బి) చాహర్ ; 49, కెప్టెన్ రైనా నాటౌట్ ; 35, దినేశ్ కార్తీక్ (బి) ఇమ్రాన్ తాహిర్ ; 3, ఫించ్ నాటౌట్ ; 33. ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: (18 ఓవర్లలో 3 వికెట్లు) 172 పరు గులు. వికెట్ల పతనం: 1-94, 2-102, 3-111. బౌలర్లు: అంకిత్ : 1-0-16-0, ఫెర్గూసన్ : 4-0-44-0, ఠాకూర్ : 3-0-14-1, స్టోక్స్ : 3-0-18-0, తాహిర్ : 4-0-53-1, చాహర్ : 3-0-26-1.

పుణె ఇన్నింగ్స్: రహానె (సి) కెప్టెన్ సురేశ్ రైనా (బి) భువనేశ్వర్ కుమార్ ; 0, త్రిపాఠి (సి) ఫించ్ (బి) టై; 33, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (సి) ఫించ్ (బి) డిఆర్ స్మిత్ ; 43, బెన్ స్టోక్స్ (బి) టై; 25, మనోజ్ తివారీ (సి) ఇశాన్ కిషాన్ (బి) టై; 31, ధోనీ ఎల్‌డబ్లు (బి) జడేజా; 5, అంకిత్ శర్మ (సి) మెకెల్లమ్ (బి) టై ; 25, శార్దూల్ ఠాకూర్ (బి) టై; 0, ఫెర్గూసన్ నాటౌట్; 1, చాహర్ నాటౌట్; 3. ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: ( 20 ఓవర్లలో 8 వికెట్లు) 171 పరుగులు. వికెట్ల పతనం: 1-0, 2-64, 3-89, 4-106, 5-120, 6-167, 7-167, 8-167. గుజరాత్ బౌలర్లు : ప్రవీణ్ కుమార్ : 4-0-51-1, బసీల్ థాంపీ : 3-0-21-0, జక్తీ : 2-0-22-0, ఆండ్రీ టై : 4-0-17-5, రవీంద్ర జడేజా : 4-0-40-1, డిఆర్ స్మిత్ : 2-0-10-1, కెప్టెన్ సురేశ్ రైనా : 1-0-9-0.