Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కసాయి తల్లి…!

Gujarat woman slits teen daughter’s throat with paramour's help

అహ్మదాబాద్: మాతృత్వానికి మచ్చగా నిలిచే ఘటన ఇది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురు పాలిట తల్లి కసాయిగా మారిన వైనం. తన అక్రమసంబంధం ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతో ప్రియుడితో కలిసి అతి దారుణంగా గొంతు కోసి హతమార్చింది. ఈ అమానుష ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పటాడి తాలుకాలోని ధామా ప్రాంతానికి చెందిన కంకూ థాకుర్ అనే మహిళ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకు 17 ఏళ్ల కూతురు సోనాల్ థాకుర్ ఉంది. ఆమె కూడా అప్పడప్పు తల్లితో కలిసి పనికి వెళ్లేది. ఈ క్రమంలో బుధవారం కంకూ స్థానికుడైన ఉమాంగ్ ఇంట్లో పనికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత సోనాల్‌కు అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఉమాంగ్‌తో తల్లి కంకూ చూడలేని స్థితిలో ఉంది. దాంతో సోనమ్ వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అది గమనించిన కంకూ, ఉమాంగ్ తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయటపెడుతుందనని భయపడి సోనాల్‌పై కత్తితో దాడి చేశారు.

ఉమాంగ్ బాలిక కాళ్లు పట్టుకోగా కంకూ ఆమె గొంతు కోసేసింది. అనంతరం కోన ఊపిరితో ఉన్న సోనాల్ కడుపులో ఉమాంగ్ కత్తితో పొడిచాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. పొద్దున పనికి వెళ్లిన తల్లీకూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. కానీ వారి ఆచూకీ దొరకలేదు. అయితే, ఓ వ్యక్తి కంకూను ఉమాంగ్ ఇంట్లో వెళ్లడం చూసినట్లు చెప్పడంతో అక్కడి వెళ్లి చూడగా సోనాల్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమ వివాహేతర సంబంధం బయటపడుతుందోనన్న భయంతో తామే హత్య చేసినట్లు అంగీకరించారు.

Comments

comments