Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆమ్లా సెంచరీ వృథా

  • స్మిత్ మెరుపులు, పంజాబ్‌కు గుజరాత్ షాక్

smith

మొహాలి: ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే వైదొలిగిన గుజరాత్ లయన్స్‌కు ఓదార్పు విజయం దక్కింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆరు వికెట్ల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. హాషిం ఆమ్లా (108) సెంచరీతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ౩వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెలరేగి ఆడిన ఆమ్లా 60 బంతుల్లోనే 8ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 104 పరుగులు సాధించాడు. షాన్ మార్ష్ (58), మాక్స్‌వెల్ 20(నాటౌట్) కూడా రాణించడంతో పంజాబ్ మెరుగైన స్కోరును సాధించింది. ఈ సీజన్‌లో ఆమ్లా సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్ డ్వేన్ స్మిత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన స్మిత్ వరుస ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లను హడలెత్తించాడు. ధాటిగా ఆడిన స్మిత్ 38 బంతుల్లోనే 4 సిక్సర్లు, 8 బౌండరీలతో 74 పరుగులు సాధించి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతావారిలో ఇసాన్ కిషన్ (29), రైనా (౩9), దినేష్ కార్తీక్ ౩5(నాటౌట్) పరుగులు సాధించారు.

Comments

comments