Home తాజా వార్తలు ‘గల్లీ బాయ్’ ట్రైలర్ విడుదల

‘గల్లీ బాయ్’ ట్రైలర్ విడుదల

Gully Boy Official Trailer ముంబయి: బాలీవుడ్ యంగ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌, హీరోయిన్ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న చిత్రం ‘గల్లీ బాయ్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు జోయా అఖ్తర్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ‘సింబా’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కొత్త పెళ్లికొడుకు ర‌ణ్‌వీర్ ‘గల్లీ బాయ్’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించే ర‌ణ్‌వీర్ ఈ మూవీలోనూ మంచి జోష్ ఉన్న స్ట్రీట్ బాయ్ గా చీర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ లో నటిస్తున్నాడు. ఇక అలియా ముస్లిం యువతిగా లైట్ మేక‌ప్ వేసుకొని స్కార్ఫ్ తో నటించింది. ట్రైలర్ లో వీరిద్ద‌రి కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో క‌ల్కి కొచ్చిన్‌, ఆకాంక్ష పూరీ, విజ‌య్ వ‌ర్మ‌, అలీ అస్గ‌ర్ తదితరులు ఇతర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gully Boy Official Trailer is Released