Home తాజా వార్తలు ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో తుపాకీ కలకలం

ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో తుపాకీ కలకలం

GUN

మేడ్చల్: ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం తుపాకీ కలకలం సృష్టించింది. మెట్రో రైలు ఎక్కుతుండగా సతీశ్ కుమార్ అనే వ్యక్తి వద్ద తుపాకీని సిబ్బంది స్వాధీనం చేసుకొని ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. భూపాల జిల్లా కాటారానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడి వద్ద సతీశ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. టిఆర్‌ఎస్ నాయకుడు లైసెన్స్‌డ్ తుపాకీని డ్రైవర్ సతీశ్‌కు ఇచ్చి బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. ఉప్పల్‌ పోలీసులు సతీశ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.