Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తుపాకీ మిస్ ఫైర్ : కానిస్టేబుల్‌కు గాయాలు

GUN

హైదరాబాద్ : తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈ ఘటన గాంధీ ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. ఆస్పత్రి జైలు వార్డు వద్ద కానిస్టేబుల్ సాయినాథ్ తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సాయినాథ్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు సాయినాథ్‌ను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు చిలకలగూడ పోలీసులు తెలిపారు.

Gun Misfire : Constable Injured

Comments

comments