Home ఆదిలాబాద్ తుపాకీ మిస్ ఫైర్ : కానిస్టేబుల్‌కు గాయాలు

తుపాకీ మిస్ ఫైర్ : కానిస్టేబుల్‌కు గాయాలు

GUNఆదిలాబాద్ : తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మందమర్రిలో శనివారం జరిగింది. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. గంగాధర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.