Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

తుపాకీ మిస్ ఫైర్ : ఇద్దరికి గాయాలు

Gun-miss-fire

హైదరాబాద్ : ఓ సెక్యూరిటీగార్డు తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బేగంపేటలోని గురుమూర్తి లైన్‌లో ఉన్న గ్రేస్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సురేశ్ కుమార్ అనే మాజీ సైనిక ఉద్యోగి ఈ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం ఆయన తన తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డులు మహేశ్వర్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Gun miss fire: Two Security guards injured

Comments

comments