Home యాదాద్రి భువనగిరి గుండాలని యాదాద్రి జిల్లాలో కలపాలి

గుండాలని యాదాద్రి జిల్లాలో కలపాలి

Governor

మోత్కూరు : గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలోనే కలపా లని కోరుతూ ఆదివారం హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహ న్‌కు మోత్కూరు రెడ్‌క్రాస్ సంస్థ అద్యక్షు డు చింతల సత్యనారాయణ రెడ్డి, సభ్యులు ఎండి.ఖలీల్, వట్టిపల్లి రాజయ్యలు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలోనే కలపాలని, గుండాల మండ లాన్ని జనగాం జిల్లాలో కలపడంలో రైతు లు, విద్యార్థులు ఎంతో నష్టపోతారని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గుం డాలను యాదాద్రి జిల్లాలో కలపాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. గవర్నర్ సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్ల్లను న్నట్లు తెలిపారని సత్యనారాయణరెడ్డి తెలిపారు.