Search
Sunday 18 November 2018
  • :
  • :

గుండారం రిజర్వాయర్‌కు ‘జల’ కళ..!

Gundaram-reserviour

ఖమ్మం ః రైతుల పాలిట కల్ప తరువుగా పిలువ బడే గుండారం రిజర్వాయర్ ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎట్టకేలకు జలకళను సంతరించుకోంది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్ప ఫీడన పుణ్యమా అంటూ గత రెండు రోజులుగా వరుసగా కురిసిన భారీ వర్షాలకు గుండారం రిజర్వాయర్ పూర్తిగా నిండి జల కళను సంతరించుకోంది. గుండారం రిజర్వాయర్ పై ప్రాంతంలో గుట్టపై ఉన్న గౌరీగుండం నుంచి భారీగా వరద నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరడంతో గుండారం రిజర్వాయర్ పోంగిపోర్లుతున్నది. వర్షాపు వరద నీటితో పూర్తిగా నిండిన గుండారం రిజర్వాయర్ ఎక్కువైన వర్షాపు నీరు మత్తడి ద్వారా వృధాగా బయటకు పోతూ బొక్కాల వాగులో పడి గోదావరి నదిలో కలుస్తోన్నది. గుండారం రిజర్వాయర్ పూర్తిగా నిండి జల కళను సంతరించడంతో ఈ ఖరీప్ సీజన్‌లో పంటలు సాగు చేసిన ఆయకట్టు రైతుల కళ్లల్లో ఆనందం వెల్లువెరుస్తున్నది.

Comments

comments