Home తాజా వార్తలు డైరెక్టర్ క్రిష్‌కు ‘గురజాడ పురస్కారం’

డైరెక్టర్ క్రిష్‌కు ‘గురజాడ పురస్కారం’

krish

అమరావతి:ప్రముఖ సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్‌) ‘గురజాడ పురస్కారం’ను అందుకోనున్నారు. ఈ విషయాన్ని విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. ఈ ఏడాది డైరెక్టర్ క్రిష్ కు గురజాడ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 30వ తేదీన మహాకవి గురజాడ 103వ వర్థంతి జరగనున్న నేపథ్యంలో ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం  ఆయన వర్థంతి రోజున గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన పలువురు ప్రముఖులకు గురజాడ పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా పులువురు ప్రముఖులకు గురజాడ పురస్కారాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌కు ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

‘Gurajada Award’ to tollywood director Krish