Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గురుకుల కొలువుల నోటిఫికేషన్ రద్దు

  • త్వరలో కొత్త మార్గదర్శకాలతో జారీ

TSPSC

హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల సొసైటీలలో ఉపాధ్యాయులతో పాటు వివిధ కేటగిరీలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెల 6వ తేదీన వెలువరించిన తొమ్మిది నోటిఫికేషన్లను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ప్రకటించింది. సంబంధిత శాఖలు నిబం ధనల్లో సవరణలకు ప్రతిపాదించిన కారణంగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమోదం పొందిన నూతన మార్గదర్శకాలకు అనుగు ణంగా మరో నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి ఒకేసారి తొమ్మిది నోటిఫికేషన్లు వెలువరిం చింది. అయితే గురుకుల ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి సంబం ధించిన నిబంధనలపై నిరుద్యో గుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టిజిటి పోస్టులకు డిగ్రీలో ఫ్లస్ట్ క్లాస్ ఉండాలని, పిజిటి పోస్టులకు మూడేళ్ల బోధనానుభవం ఉండాలనే నిబంధనలపై నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. దాంతో ఆ నిబంధనలు సడలిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలపై కసరత్తు చేస్తున్నారు. ఆయా శాఖలు కొత్త నిబంధనలు రూపొందించిన తర్వాత ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తారు. ప్రభుత్వం ఆమో దించిన నూతన మార్గదర్శకాలు టిఎస్‌పిఎస్‌సికి అందిన తర్వాత గురుకుల పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ ప్రక్రియ పూర్తయి నోటిఫికేషన్లు జారీ కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

Comments

comments