Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రాం రహీమ్ నేరస్థుడే.. : సిబిఐ కోర్టు!

Ram-Rahim

ఛండీగఢ్ : రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న డేరా సచ్ఛా సౌధా ఛీప్ గుర్మీత్ రాం రహిమ్ సింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో డేరాబాబాను నేరస్థుడిగా పంచకుల సిబిఐ కోర్టు ప్రకటించింది. 2002లో ఇద్దరు మహిళలను రేప్ చేసినట్లుగా రాం రహీమ్ పై కేసు నమోదైంది. ఈ మేరకు ఆయన శుక్రవారం పంచశీల కోర్టుకు హాజరయ్యారు. కాగా రాం రహీమ్ ను నేరస్థుడిగా తీర్పునిచ్చిన కోర్టు ఆగస్టు 28న శిక్ష ఖరారు చేయనుంది. అంతవరకు రాం రహీమ్ ను పోలీస్ కస్టడీకి తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

రాం రహీమ్ ను దోషిగా ప్రకటించిడంతో హర్యానా, పంజాబ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రహీమ్ అనుచరులు ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అంతేకాక.. రహీమ్ అనుచరులు సంయమనం పాటించాలని హర్యానా సిఎం సూచించడం విశేషం. గొడవలు జరుగనున్నాయనే సూచనల మేరకు పంచకుల సిబిఐ కోర్టు వద్ద అధికారులు భారీగా బిఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. రాం రహీమ్ ను అధికారులు

 

Comments

comments