Home జాతీయ వార్తలు జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ దోషి

జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ దోషి

 

చండీగఢ్: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌ను దోషిగా ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ధారించింది. జనవరి 17న శిక్షకు సంబంధించి ఇతర వివరాలను కోర్టు ప్రకటిస్తుంది. 16 సంవత్సరాల క్రితం జరిగిన ఈ హత్యకు సంబంధించిన తీర్పును రోహతక్‌లోని సునరియా జైలులో ఉన్న గుర్మీత్‌కు టెలికాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. రెండు వేర్వేరు అత్యాచార కేసులకు సంబంధించి 2017లో వెలువడిన తీర్పు మేరకు అతను 20 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు.

Gurmeet Singh Covicted in Journalist Murder, Special CBI Court in Panchkula will pronouce the punishment on Jan 17