Home కుమ్రం భీం ఆసిఫాబాద్ గుట్టు చప్పుడు కాకుండా… గుట్కా దందా

గుట్టు చప్పుడు కాకుండా… గుట్కా దందా

Gutka

జిల్లాలో మళ్లీ గుట్కా వ్యాపారం
మూడుపువ్వులు ఆరుకాయలు అన్నట్లు వ్యాపారం
పట్టించుకోని పోలీసులు

మనతెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : జిల్లా కేంద్రంలో మళ్ళీ గుట్కా వ్యాపారం ప్రారంభం అయింది. ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండగా సంబంధితాధికారులు తమకు ఎందుకులే అన్నట్లు వ్యవహారిస్తుండడంతో మామూళ్ళు ఏమైనా ముడుతున్నాయ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గత నెల రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా గుట్కా అమ్మకాలు నిర్వహిస్తున్న దుకాణాల పై దాడులు నిర్వహించి చిన్న చిన్న కేసులు నమోదు చేసి వదిలి వేశారు. పై అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికి నామమా త్రంగా దాడులు నిర్వహించి వదిలివేస్తుండడంతో గుట్కా వ్యాపారానికి అలవాటు పడ్డ వ్యాపారులు మళ్ళీ వారి దందాను కొనసాగిస్తున్నారు. గుట్కా తయారు చేసే కంపెనీలనే మూసివేయించాలి.

కానీ గుట్కా అమ్మకం దారు లపై దాడులు చేయడం ఏమిటాని కొందరు ప్రశ్నిస్తున్నా రు. గుట్కాలు తిన్నడం వల్ల ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్, టిబి, కాలేయ వ్యాధి తదితర ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఒకవైపు వైద్యులు హెచ్చరిస్తున్నప్పటి కీ గుట్కా ప్రియులు మాత్రం వీటికి దూరంగా ఉండలేక పోతున్నారు. జిల్లా కేంద్రానికి పెద్ద మొత్తంలో గుట్కాలను తరలించడంతో కాగజ్‌నగర్ బెల్లంపల్లి పట్టణాల వ్యాపా రులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని వారసంత అయిన టువంటి శనివారం రోజున గుట్టుచప్పుడు కాకుండా వ్యాన్‌ల ద్వారా డంప్ చేసి వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో పౌరసరఫరాల శాఖ జిల్లా స్దాయి అధికారులు అందరు ఉన్నప్పటికి ఎవరూ పట్టించుకోకుండా మాములుగా తీసుకుంటున్నారు.

గత నెల రోజుల క్రితం దుకాణాల వద్ద గుట్కా స్దావరాల వద్దదాడులు నిర్వహించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియడం లేదని పలువిమర్శాలు సైతం వస్తున్నాయి. హోల్ సేల్ దుకాణాల వద్ద పాన్‌షాప్‌ల వద్ద గుట్కాలు విడివిడిగా లభిస్తున్నాయి. కొందరు వ్యాపారులు చిన్నచిన్న దుకాణదారులకు పాన్ షాప్‌ల వారికి అధిక రేట్లకు విక్రయిస్తుండగా ఇదే అదనంగా భావించిన పాన్ షాప్ వ్యాపారులు ఇతర వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతు సోమ్ము చేసుకుంటున్నారు.

ఎటు తిరిగి గుట్కా ప్రియుల పైనే పూర్తి భారం పడుతుంది. ఇంక హోల్‌సేల్ వ్యాపారులు రహస్యంగా గోదామ్‌లలో నిల్వ ఉంచుకొని ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిషేదిత గుట్కా వ్యాపారం సాగకపోతే పాన్‌షాప్‌ల వద్ద చిన్నచిన్న దుకా ణాల వద్ద గుట్కాలు ఎక్కడి నుండి వస్తున్నాయని అధికారులకు తెలియకుండానే ఈ దందా సాగుతుందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధితాధి కారులు నిషేదిత గుట్కా వ్యాపారానికి కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.