Home తాజా వార్తలు కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసింది : గుత్తా

కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసింది : గుత్తా

Guttaనల్గొండ : నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసిపోయిందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి సోదరులు తమకు తామే ఓటమిని కొనితెచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపి స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోనున్నారని గుత్తా వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎంఎల్ సి ఎన్నికల తీర్పు కోమటిరెడ్డి సోదరులకు ఓ గుణపాఠం కానుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండలో ఉత్తమ్, జానారెడ్డిల పని అయిపోయిందని ఆయన పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల్లో సైతం టిఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జడ్ పి చైర్మన్ లతో పాటు అన్ని ఎంపిపి స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని ఆయన తేల్చి చెప్పారు.

Gutta Comments on Komatireddy Brothers