Search
Wednesday 14 November 2018
  • :
  • :

జస్ట్ పిజ్జా నోట్లో పెట్టి వాళ్ల గొడవను ఆపేశాడు..!!

అది ఓ పిజ్జా షాప్. పక్కన ఫుట్ పాత్ మీద ఇద్దరు గొడవ పడుతున్నారు. బీభత్సంగా కొట్టుకుంటున్నారు. ఇంతలో కస్టమర్ ఆర్డర్ చేసిన పిజ్జా ను ఇవ్వడానికి వెయిటర్ వచ్చి.. ఈ తతంగాన్నంతా చూశాడు.

అయితే, అక్కడున్నవాళ్లు మాత్రం ఎవ్వరూ వాళ్ల జోలికి పోలేదు. మనోడు మాత్రం తిన్నగా పిజ్జా ప్లేట్ ను అలాగే పట్టుకెళ్లి.. వాళ్లను లేపి మరి పిజ్జా తినిపించాడు. అంతే, పిజ్జా తిన్న వాళ్లిద్దరూ అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ తతంగాన్నంతా చూస్తున్న జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇదంతా అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డు అయింది. ఇక చూసుకోండి, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అంతే కాదు, ఒక్క పిజ్జా తో గొడవను ఆపేసిన వెయిటర్ ను హీరోగా పొగుడుతూ కామెంట్ల మీద కామెంట్లు పుట్టుకొస్తున్నాయి సోషల్ మీడియాలో…దానికి సంబంధించిన వీడియో ఇదే….

Comments

comments