Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ‘అది కట్టకపోవడం బాబు చేతకానితనానికి నిదర్శనం’

‘అది కట్టకపోవడం బాబు చేతకానితనానికి నిదర్శనం’

Woman dead after BJP MP GVL car collision

 

ఢిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేసేవి దగా, మోసపూరిత రాజకీయాలు అని బిజెపి జివిఎల్ నరసింహ రావు  ఘాటు విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో రెండంతస్థుల భవనం కూడా కట్టలేకపోవడం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. హైకోర్టు భవనాలను సకాలంలో పూర్తి చేయని, రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ నేరం కింద కేసు వేయాలన్నారు. తీర్పులను అమలు చేయకుండా సుప్రీం, హైకోర్టులను అవమానపరుస్తున్నారని జివిఎల్ దుయ్యబట్టారు. న్యాయ వ్యవస్థలను కించపరిచేలా చంద్రబాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. సరైన వసతులు లేవని, హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం కావాలని ఎపి బార్ కౌన్సిల్ కోరిందని, అయినా చంద్రబాబు పట్టించుకోలేదని జివిఎల్ మండిపడ్డారు.

 

GVL Comments on Chandra babu Naidu, Chandra babu Naidu Not Constructed Two floors Building with In Year, this is Shame