Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఏప్రిల్ 2 నుంచి హెచ్-1బి దరఖాస్తులు

h1-b

 ప్రీమియం ప్రాసెసింగ్ తాత్కాలికంగా రద్దు

వాషింగ్టన్ : ఏప్రిల్ 2 నుంచి హెచ్1బి దరఖాస్తులను అమెరికాఆమోదిస్తుంది.అయితే వర్క్ వీసా వంటి  ప్రీమి యం ప్రక్రియలను  తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఫెడరల్ సంస్థ తెలిపింది. వర్క్ వీసా అన్నది భారతీయ  ఐటి నిపుణులకు చాలా ముఖ్యం.2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్ 1బి దరఖాస్తుల దాఖలు 2018 అక్టోబరు 1 నుంచి ఆరంభం కానున్నదని యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్‌సిఐఎస్) పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు చేస్తున్న ట్లు తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఈ వీసాల ద్వారా అమెరికా వెళ్తుంటారు. హెచ్1-బి వీసాలతో అమెరికాలోని కంపెనీలు భారత్, చైనాలాంటి దేశాల నుం చి టెక్నాలజీ నిపుణులను వేల సంఖ్యలో నియమించుకుంటున్నాయి. హెచ్1-బి తాజా దరఖాస్తులు 2019 ఆర్థిక సం వత్సరం కోసం తీసుకుంటున్నారు.  2019 సంవత్సరానికి ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు చేస్తున్నామని, అయితే ఈ ఏడాదికి సంబంధించి 2018 సెప్టెంబరు 10 వరకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను కొనసాగించనున్నట్లు తెలిపింది.ఈ ప్రీమి యం ప్రాసెసింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా ప్రజలకు సమాచారం ఇస్తామని యూ ఎస్‌సిఐఎస్ స్ప ష్టంచేసింది. హెచ్1-బి వీసా దరఖాస్తుల పరిశీలన సమ యం తగ్గించేందుకే తాత్కాలికంగా ప్రీమి యం ప్రాసెసింగ్‌ను నిలిపేస్తున్నామని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తులు ఎక్కువగా వస్తుండడంతో సాధారణ దరఖాస్తులు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, వాటి పరిశీలన సమ యం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది. ఏటా 65వేల హెచ్1-బి వీసాలు జారీ చేస్తారు. యూఎస్‌సిఐఎస్ వివరాల ప్రకారం 2007 నుంచి 2017 సంవత్సరా ల మధ్య హెచ్1-బి వీసాల కోసం భారతీయులు అత్యధికంగా 22 లక్షల దరఖాస్తులు దాఖలు చేశారు.3లక్షలకుపైగా దరఖాస్తులతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. సంవత్సరానికి హెచ్1బి వీసాల పరిమితిని  65,000మేరకు కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) నిర్ణయించింది. మొదటి 20,000 దరఖాస్తులను అమెరికా మాస్టర్స్ డిగ్రీ లేక అంతకన్నా ఎక్కువ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

comments