Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పాక్‌కు తగ్గి.. భారత్‌కు పెరిగాయి

  • దాయాది దేశాలకు 40% వీసాలు కట్
  • ఇండియాకు అదనంగా 28%

Golden-Visa

ఇస్లామాబాద్ : అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్థాన్‌కు వీసాల షాక్ ఎదురైంది. పాకిస్థాన్ జాతీయులకు అమెరికా వీసాల మంజూరీ 40 శాతం తగ్గిం ది. ఇదే సమయంలో ట్రంప్ అధికార యంత్రాంగం భారత్ కు వీసాల జారీని పెంచింది. ఈ ఏడాది మార్చి , ఏప్రిల్‌ల లో భారత్‌కు వీసాల మంజూరీలో 28 శాతం పెరిగింది. ప్రెసి డెంట్ ట్రంప్ వెలువరించిన వీసాల నిషేధ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరు లేకపోయి, ఆ దేశానికి వీసాల మంజూరీలో బాగా వడపోత జరిగినట్లుగా వెల్ల డైంది. వీసాలకు సంబంధించి విడుదలైన నెలవారీ గణాం కాలలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు భారత్‌కు నానా ఇమ్మిగ్రేషన్ వీసాల మంజూరీ పెరుగు తున్న దశ లో, మరో వైపు పాకిస్థాన్‌కు వీసాలు మంజూరు లో కోత పడింది. గత ఏడాది ఈ నెలలోనే జారీ అయిన వీసాల ప్రక్రియ సగటు లెక్కలతో సరిపోలిస్తే పాకిస్థాన్‌కు వీసాల మంజూరీ తగ్గింది. భారీ గండి పడింది. అమెరికా విదే శాంగ శాఖ వెలువరించిన వీసా మంజూరీ గణాంకాల ను ఉటంకిస్తూ పాకిస్థాన్ పత్రికలలో వార్తలు వెలువ రించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఎప్రిల్‌లో పాకిస్థాన్ జాతీయులకు 3925 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలు, మార్చిలో 3793 వీసాలు మంజూరు అయ్యా యి. గత ఏడాది ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఏకం గా 78, 637 వీసాలు పాకిస్థాన్‌కు మంజూరు అయ్యాయి. గత ఏడాది మార్చిలో పాకిస్థాన్‌కు వీసాలు 40 శాతం వరకూ పెరుగుదల ఉండగా, విచిత్రంగా ఈ ఏడాది ఇదే నెలలో ఆ మేరకు కోత పడటం గణనీయ పరిణామంగా మారింది.
కోత కాదు , వివిధ అంశాల పరిగణన
పాకిస్థాన్‌కు వీసాల తగ్గింపులో నిర్థిష్ట కారణంలేదని , ఒక్కో ఏడాది ఒక్కో విధంగా ఉంటుందని , వీసాల జారీలో పలు అంశాలు మిళితం అయి ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. పలు స్థానిక, అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అమెరికా తెలి పింది. ప్రత్యేకించి పర్యాటక అనుకూల కాలంలో వీసాల సంఖ్య పెరుగుతుందని , శీతాకాల సెలవులు, వేసవిలో ఎక్కువగా ఉంటాయని తెలిపిన విదేశాంగ శాఖ పాకిస్థాన్ కు ఎందుకు కోత విధించారనేది తెలియచేయలేదు. దేశం, జాతీయత, లేదా వీసా కేటగిరిలను బట్టి వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని వివరణ ఇచ్చారు.
ఈసారి భారత్‌కు అత్యధికం
ఈ ఏడాది మార్చిలో భారతీయులకు 97,925 వీసాలు, ఎప్రిల్‌లో 87,049 వీసాలు మంజురు అయ్యాయి.గత ఏడాదితో పోలిస్తే ఇవి ఎక్కువగా నమోయ్యాయి. ముస్లిం ఆధిక్య దేశాల వారికి వీసాల మంజూరిలో ట్రంప్ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో వడపోతను ప్రదర్శి స్తోంది. కొన్ని ముస్లిం దేశాల నుంచి ప్రయాణికుల రాకడ పై నిషే ధం విధించింది. అయితే ఈ నిషేధ జాబితాలోకి రాని ముస్లిం దేశాలకు కూడా వీసాలపై కోతలు పెట్టినట్లు తాజా ఉదంతంతో వెల్లడైంది. పాకిస్థాన్ ఒక్కటే కాకుండా ఇతర ముస్లిం దేశాలకు కూడా నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో కోత పడింది. 50 ముస్లిం దేశాలకు అమెరికా జారీ చేసిన వీసా లను సగటున పరిశీలిస్తే స్పష్టం అయిం ది. మొత్తం మీద ఆ దేశాలకు వీసాలు 20 శాతం మేర తగ్గి నట్లు వెల్లడైంది. ట్రంప్ ట్రావెల్ నిషేధిత జాబి తాలో ఇరాన్, సిరియా, సూ డాన్, సొమాలియా, లిబియా, యెమెన్‌లు ఉన్నాయి. ఇతర ముస్లిం దేశాల నుంచి కూడా అం దే వీసాల దరఖా స్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే నాన్ ఇమ్మి గ్రేషన్ వీసాల మంజూరు జరుగుతున్నట్లు స్పష్టం అయింది.

Comments

comments