Search
Saturday 22 September 2018
  • :
  • :

నా ఆధార్‌ను హ్యాక్ చేయండి

troy

 ట్రాయ్ చైర్మన్ సవాలు 

పలు వివరాలు బహిర్గతం చేసిన నెటిజన్
 శర్మ ఆధార్ హ్యాక్ కాలేదు: యుఐడిఎఐ వివరణ

న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జ రుగుతున్న నేపథ్యంలో ఆధార్‌లో సమాచారం భ ద్రమని, దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరంటూ సవా లు విసిరారు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆ అధికారి ఎవరో కాదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)చైర్మన్ ఆర్ ఎస్ శర్మ. తన ఆధార్ నంబర్‌ను ట్విట్టర్‌లో బహిర్గతం చేసి అది ఎలా దుర్వినియోగం అవుతుందో తెలపాలంటూ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సవాలు విసిరారు కూడా. కాస్సేపటికే శర్మకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఓ నెటిజన్ బయటపెట్టడంతో సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ మొదలైంది. అయితే ఆ నెటిజన్ బయటపెట్టిన సమాచారమంతా అందరికీ తెలిసిందేనని, కొత్తగా ఏ విషయాన్ని వెల్లడించలేద ని ఈ వ్యవహారంపై స్పందించిన ఆధార్ సంస్థ స్ప ష్టం చేసింది. ఈ స్పష్టతతో ప్రస్తుతానికైతే ఈ వి వా దం సద్దుమణగవచ్చునేమో కానీ ఆధార్ భద్రత పై దేశవ్యాప్త చర్చ మాత్రం అలాగే కొనసాగనుంది.
విషయంలోకి వెళ్తే.. ఆధార్ గోప్యతను బలం గా నమ్మే శర్మ శనివారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను బహిర్గతం చేశారు.‘ఎవరైనా నా ఆధార్ నంబర్‌ను కలిగి ఉంటే వారు నాకు ఎలా హాని చేస్తారో చెప్పా లి. నా ఆధార్ నంబర్‌ను ఇస్తున్నాను’ అంటూ శర్మ సవాలు విసిరారు. కొద్ది సేపటికే నెటిజన్లు ఈ సవాలుకు సానుకూలంగా స్పందించారు. దీంతో శర్మ ట్విట్టర్‌లో తన ఆధార్ నంబర్‌ను బహిర్గత పరిచా రు.‘ ఆధార్ నంబర్ తెలిస్త్తే నాకు హాని కలిగించే ఒక ఉదాహరణను చూపించు’ అంటూ సవాలు విసిరారు. వెంటనే ట్విట్టర్‌లో ఎలైట్ ఆల్డర్సన్ అనే ఫ్రెంచ్ సెక్యూరిటీ స్పెషలిస్టు శర్మకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బైటపెట్టడం పారరంభించాడు. శర్మ ఫోన్ నంబర్, ఆయన ఈ మెయిల్ ఐడి, పాన్ సమాచారం..ఇలా ఒక్కో సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మరికొన్ని వ్యక్తిగత వివరాలు కూడా తెలిపాడు. అంతేకాదు, తాను ఇక్కడితో ఆపేస్తున్నానని, ఆధా ర్ నంబర్‌ను బహిర్గతం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుందని భావిస్తున్నానని కూడా అతను వ్యాఖ్యానించాడు. ఈఉదంతం తర్వాత శర్మకు మద్దతుగా, వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు స్పందించారు. దీనిపై ఆధార్ కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు సంస్థ (యుఐడిఎఐ) కూడా స్పందిస్తూ, శర్మ ఆధార్ హ్యా క్ కాలేదని, ఆల్డర్సన్ బైటపెట్టిన వివరాలన్నీ కూ డా ఇదివరకే వివిధ ప్లాట్‌ఫామ్‌లద్వారా వెల్లడయినవేనని స్పష్టం చేసింది.

Comments

comments