Home అంతర్జాతీయ వార్తలు ఇస్లా మిక్ స్టేట్‌పై హ్యా కర్ల యుద్ధం

ఇస్లా మిక్ స్టేట్‌పై హ్యా కర్ల యుద్ధం

HYAKARఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)పై కొందరు హ్యాకర్లు యుద్ధం ప్రకటించారు. పారిస్‌పై ఉగ్రదాడిని నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోమవారం యూట్యూబ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ముఖానికి మాస్క్ , నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి వీడియోలో కనిపించాడు. తమ లాంటి హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. నవంబరు 13న పారిస్‌లో ఐఎస్ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారని, వారికి వ్యతిరేకంగా ఆపరేషన్‌ను ప్రారంభించామని , తమ సైబర్ దాడులకు సిద్ధంగా ఉండాలంటూ ప్రకటించారు. మూడు రోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిస్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 129 మంది చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా కొందరు హ్యాకర్లు ఈ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో విడుదల చేసిన ఒక్కరోజులోనే 1.3 మిలియన్లమంది వీక్షించారు.