Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జుట్టు సంరక్షణకు బాదం నూనె

almond-oilబాదం తింటే ఆరోగ్యానికి ఎంతో బలాన్నిస్తుంది.  ఆరోగ్య కరమైన  జుట్టుకు బాదం నూనె సహకరిస్తుంది. బాదం పప్పు నుండి బాదం నూనెను తయారుచేస్తారు. బాదం ఆయిల్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది. బాదం నూనెలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్,  విటమిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఈ నూనె చర్మానికి, జుట్టుకు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. బాదం ఆయిల్ ను జుట్టుకు పట్టించడం వల్ల  అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బాదం ఆయిల్ తలకు పట్టించడం వల్ల వల్ల చుండ్రు రాకుండా ఉంటుంది. అదేవిధంగా, జుట్టు పెరగదానికి సహాయపడుతుంది. ఈ బాదం నూనెలో ఉండే మెగ్నీషియం జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. జుట్టు మెరిసేలా మారుస్తుంది.  తలస్నానం చేసిన తర్వాత కూడా రెండు మూడు చుక్కల బాదం ఆయిల్ ను జుట్టు అంతా రుద్దడం వల్ల షైనీగా మారుతుంది. వారంలో రెండు సార్లు బాదం ఆయిల్ తో హెయిర్ మసాజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.  పొడి జుట్టు రాకుండా ఉంటుంది.  మొత్తం మీద జుట్టుకు బాదం ఆయిల్ పెట్టడం వల్ల అందంగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనపడుతుంది.

Comments

comments