Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హజ్ సబ్సిడీ ఎత్తివేత

haj

రాయితీ నిధులతో మైనారిటీలకు లబ్ధి శూన్యం
ఆ నిధులు ముస్లిం బాలికల విద్యకు ఉపయోగిస్తాం : కేంద్ర మంత్రి నఖ్వీ

న్యూఢిల్లీ: హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సబ్సిడీ నగదును మైనార్టీల సంక్షేమానికి ఉపయోగిస్తామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం వెల్లడించారు. భారత్ నుంచి మొదటిసారిగా ఈ ఏడాది 1.75 లక్షల మంది యాత్రికులు ఎటువంటి రాయితీ లేకుండా హజ్ యాత్ర కు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది 1.25 లక్షల మంది యాత్రికులు హజ్ వెళ్లారు. రాయితీని ఉపసంహరించుకోవడం వల్ల ప్రభుత్వానికి రూ.700 కోట్లు ఆదా అవుతుందని, ఈ మొ త్తాన్ని ముస్లిం బాలికల విద్యకు, ఆ వర్గానికి చెందిన వారి సంక్షేమానికి ఉపయోగించనున్నట్టు తెలిపారు. రాయితీతో మైనారిటీలకు ఏ మాత్రం లబ్ధి చేకూరడం లేదన్నారు. సముద్ర మార్గం ద్వారా కూడా యాత్రికులు హజ్ చేరుకునేందుకు సౌదీ ప్రభు త్వం అంగీకరించిందని నఖ్వీ పేర్కొన్నారు.  ఈ ఏడాది దాదాపు 1300 మంది మహిళలు పురుషుల తోడు లేకుండా యాత్రకు వెళ్తున్నారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని క్రమంగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించింది.

Comments

comments