Home తాజా వార్తలు ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదుల హతం

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదుల హతం

Srinagar : Encounter in Handwara at Jammu Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని  హజిన్ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు తీవ్రవాదులు ఒక ఇంట్లో చొరబడ్డారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. దీంతో భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య  ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒక తీవ్రవాది ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.