Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

హలీమ్ స్పెషల్

చికెన్ హలీమ్

కావలసిన వస్తువులు:
బోన్ లెస్ చికెన్ :- అర కేజీ
గోధుమ రవ్వ -: పావు కేజీ
బియ్యం -: 1/4 కప్పు
సెనగపప్పు :- 1/4 కప్పు
నూనె -: 1/4 కప్పు
నెయ్యి :- 1/4 కప్పు
పచ్చిమిర్చి :- 5
అల్లం వెల్లుల్లి ముద్ద :- 2 టీ స్పూన్లు
కారం పొడి -: 2 టీ స్పూన్లు
మిరియాలపొడి :- 1/2 టీ స్పూన్
పసుపు -: 1 టీ స్పూన్
గరం మసాలాపొడి -: 1 టీ స్పూన్
సొంఠి పొడి -: 1/2 టీ స్పూన్
పుదీనా -: 1/4 కప్పు
కొత్తిమీర :- 1/4 కప్పు
లవంగాలు -: 8
దాల్చిన చెక్క :- 4
యాలకులు -: 8
షాజీరా :- 2 టీ స్పూన్లు
పెరుగు -: 1 కప్పు
ఫ్రైడ్ ఆనియన్ -: కొద్దిగా
నిమ్మ చెక్కలు : కొన్ని
ఉప్పు -: తగినంత

Haleem

తయారుచేయు విధానం: కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, బియ్యం, సెనగపప్పు, పుదీనా, కొత్తిమీర  వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, సగం యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా, రెండు పచ్చిమిర్చి, పసుపు అన్నీ సగం చొప్పున వేసుకోవాలి. ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీర అన్నీ సగం చొప్పున సన్నటి బట్టలో మూటకట్టి  వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చాక మూత తీసి గోధుమ రవ్వ వేసి కలిపి మూతపెట్టాలి. మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మూటకట్టిన మసాలా మూట తీసేసి గ్రైండ్ చేసుకోవాలి.  మందపాటి కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో మిగిలిన లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు,  షాజీర, అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేయాలి. నూనెలో కొద్దిగా వేగాక పసుపు, సొంఠి పొడి, మిరియాలపొడి, కారం పొడి, గరం మసాలాపొడి వేసి కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో పెరుగు వేసి కలపాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉడికించాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యివేసి కలిపి మరి కొద్దిసేపు ఉంచాలి. మొత్తం ఉడికి నూనె పైకి తేలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమిర, పుదీనా, నిమ్మ చెక్కలు, కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేసుకోవాలి.

వెజ్ హలీమ్

కావలసిన పదార్థాలు:
బంగాళదుంప ముక్కలు : అర కప్పు
బీట్ రూట్: అర కప్పు
క్యారట్ : అర కప్పు
బీన్స్ : అర కప్పు
ఉల్లిపాయ : అర కప్పు
పచ్చిమిర్చి తరుగు :2టీ స్పూన్లు
బఠాణీలు : అర కప్పు
గోధుమరవ్వ : అర కేజీ
నెయ్యి : 1 కప్పు
పాలు : అర కప్పు
పసుపు : 2 టీ స్పూన్లు
లవంగాలు :- 7
దాల్చిన చెక్క :- 3
యాలకులు : – 7
షాజీరా – : 2 టీ స్పూన్లు
జీడిపప్పు : అర కప్పు
పిస్తా పప్పు: అర కప్పు
బాదంపలుకులు:1/2 కప్పు
కిస్మిస్ : పావు కప్పు
ఏలకులు: 4
మిరియాలు:టీ స్పూన్
నిమ్మ చెక్కలు : కొన్ని
పుదీనా : కొద్దిగా
కొత్తిమీర : కొద్దిగా
ఫ్రైడ్ ఆనియన్ -: కొద్దిగా
ఉప్పు: తగినంత

తయారుచేయు విధానం: ముందుగా కూరగాయ ముక్కల్లో తగినన్ని నీళ్లు పోసుకుని, ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీర అన్నీ సన్నటి బట్టలో మూటకట్టి వేసి ఉడికించి, తర్వాత మూటకట్టిన మసాలా మూట తీసేసి, నీళ్లను తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత నెయ్యిలో కిస్మిస్, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉల్లితరుగు వేసి వేయించాలి . కళాయిలో సగం నెయ్యి వేసి ఏలకులు, మిరియాలు, పచ్చిమిర్చి, ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, గోధుమరవ్వ వేసి పది నిమిషాలు వేయించాలి. కూరగాయలు ఉడికించిన నీళ్లు, ఉప్పు వేసి అరగంట సేపు ఉడికించి, ముక్కలను పప్పుగుత్తితో మెదపాలి. తర్వాత ముందుగా వేయించి ఉంచుకున్న కిస్మిస్, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, పుదీనా,
కొత్తిమీర, నిమ్మచెక్కలతో అలంకరించుకోవాలి.

మటన్ హలీమ్

కావలసిన పదార్థాలు:
మటన్ :- 1/4 కేజీ
పెసరపప్పు :- అర కప్పు
సెనగపప్పు:- అర కప్పు
గోధుమలు :1 కప్పు
నెయ్యి : -అర కప్పు
ఉల్లిపాయలు :- 2
అల్లం వెల్లుల్లి -: 2 టీ స్పూన్లు
పసుపు : -అర టీ స్పూన్
కారం పొడి -: 1 స్పూన్
గరం మసాలాపొడి:-1టీ స్పూన్
ధనియాలపొడి -: 1 స్పూన్
లవంగాలు :- 6
దాల్చిన చెక్క -: 3
యాలకులు :- 6
షాజీరా :- 1 టీ స్పూన్
నిమ్మ చెక్కలు : కొన్ని
పుదీనా : కొద్దిగా
కొత్తిమీర : కొద్దిగా
ఫ్రైడ్ ఆనియన్ :- కొద్దిగా
ఉప్పు -: తగినంత

తయారు చేయు విధానం: గోధుమలు నాలుగు గంటలు నీటిలో నానబెట్టి, వడకట్టి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన పప్పులు కూడా నీటిలో నానబెట్టుకోవాలి. ఒక వెడల్పాటి కళాయి తీసుకుని అందులో సుమారు లీటరు నుంచి రెండు లీటర్ల నీటిని మరిగించాలి. ఇందులో నానబెట్టి వడకట్టిన పప్పులన్నీ, గోధుమ రవ్వ, మటన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అవి ఉడుకుతుండగా ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా అన్నీ సన్నటి బట్టలో మూటకట్టి  వేసి, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి, పసుపు, కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేయాలి. చిన్న మంట మీద నిదానంగా మటన్ పూర్తిగా మెత్తబడేవరకు ఉడికించాలి. తర్వాత మూటకట్టిన మసాలా మూట తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి వేసి చిన్న మంటమీద మళ్ళీ కాసేపు కలుపుతూ మంచి వాసన వచ్చేదాకా ఉడికించాలి. మొత్తం ఉడికి నూనె పైకి తేలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం కలిపి వడ్డించాలి.

సుస్మిత చౌదరి
సుస్మిత స్కూల్ ఆఫ్ కుకరి

9393169595

Comments

comments