Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

క్వీన్ హలెప్

french-open

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్టీఫెన్స్ ఓటమి

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రుమేనియా స్టార్, టాప్ సీడ్ సిమోనా హలెప్ టైటిల్‌ను గెలుచుకుంది. గతంలో రెండు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్న హలెప్ ఈ సారి ట్రోఫీని ముద్దాడింది. శనివారం జరిగిన ఫైన ల్లో హలెప్ 36, 64, 61 తేడాతో అమెరికా ఆ శాకిరణం, పదో సీడ్ స్లొవానె స్టీఫెన్స్‌ను ఓడించింది. స్టీఫెన్స్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా హలెప్ టైటిల్ సాధించడంలో సఫలమైంది. ప్రారంభం నుంచే పో రు ఉత్కంఠ భరితంగా సాగింది. తొలి సెట్‌లో స్టీఫె న్స్ జోరును కొనసాగించింది. చక్కని షాట్లతో హలెప్‌ను వణికించింది. స్టీఫెన్స్ ఎదురుదాడికి దిగడంతో హలెప్ ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో స్టీఫెన్స్ సఫలమైంది. కోర్టు నలుమూలలా చక్కని షాట్లను కొడుతూ అలరించింది. ఇదే క్రమంలో హలెప్‌కు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌ను ఏకపక్షంగా మార్చిన స్టీఫెన్స్ 63 తేడాతో దీన్ని కైవసం చేసుకుంది.
ఎదురుదాడి..
తొలి సెట్‌లో ఓటమి ఎదురైనా హలెప్ పోరాటం వీడలేదు. రెండో సెట్‌లో గట్టి పోరాట పటిమను కనబరిచింది. స్టీఫెన్స్‌కు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగింది. ఇద్దరు దూకుడైన ఆటతో ఆకట్టుకున్నారు. ప్రతి గేమ్‌లోనూ ఉత్కంఠ సమరం తప్పలేదు. ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఒక గేమ్ హలెప్ గెలుస్తే మరో గేమ్ స్టీఫెన్స్ గెలుస్తూ లక్షంగా దిశగా అడుగులు వేసింది. దీంతో రెండో సెట్‌లో రసవత్తర పోరు సాగింది. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడడంతో ఒక దశలో పోరు 44తో సమమైంది. ఇద్దరు చెరో నాలుగు గేమ్‌లు గెలిచి సమంగా నిలిచారు. కానీ, ఈ దశలో హలెప్ ఒక్కసారిగా చెలరేగి పోయింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే చక్కని షాట్లతో స్టీఫెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకుని సెట్‌ను దక్కించుకుంది. కాగా, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు ఏకపక్షంగా సాగింది. రెండో సెట్‌లో గెలిచిన హలెప్ సమరోత్సాహంతో మూడో సెట్‌కు సిద్ధమైంది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. స్టీఫెన్స్‌కు ఏమాత్రం అవకాశ ఇవ్వలేదు. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే సమయంలో స్టీఫెన్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. తొలి రెండు సెట్లలో హలెప్‌కు గట్టి పోటీ ఇచ్చిన స్టీఫెన్స్ కీలకమైన మూడో సెట్‌లో చేతులెత్తేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన హలెప్ 50 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరో గేమ్‌ను స్టీఫెన్స్ గెలిచిన ఫలితం లేకుండా పోయింది. తర్వాతి గేమ్‌ను సొంతం చేసుకున్న హలెప్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. కిందటి ఏడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న హలెప్ ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ టైటిల్ కలను నెరవేర్చుకుంది.

Comments

comments