Home సినిమా చేతిలో అరడజను సినిమాలు!

చేతిలో అరడజను సినిమాలు!

Trisha30 ప్లస్ వయసులో పడ్డారంటే హీరోయిన్ల కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లుగానే భావిస్తారు. కానీ ఈమధ్య కొందరు హీరోయిన్లు 30 దాటిన తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. నయనతార, త్రిష, శ్రియ ఈ కోవలోకే వస్తారు. ఈ ముగ్గురిలోనూ యమ స్పీడుమీదున్నది త్రిషే అని చెప్పాలి. ఆమె చేతిలో ప్రస్తుతం అర డజను సినిమాలుండటం విశేషం. ఐదు సినిమాలు విడుదలకు ముస్తాబవుతుంటే… కొత్తగా ఇంకో సినిమాను మొదలుపెడుతోంది త్రిష. ఆ చిత్రం పేరు ‘96’. ప్రస్తుతం తమిళ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదొక వైవిధ్యమైన థ్రిల్లర్ అంటున్నారు. త్రిష గత ఏడాది, ఈ ఏడాది కమిటైన ఐదు సినిమాల్ని దాదాపుగా పూర్తి చేసేసింది. అరవింద్ స్వామిక జోడీగా ‘శతురంగ వేట్టై 2’లో నటిస్తున్న త్రిష… ‘మోహిని’ అనే హార్రర్ థ్రిల్లర్‌లో లీడ్ రోల్ చేస్తోంది. దీంతోపాటు హేయ్ జూడ్, 1818, గర్జనై సినిమాల్లోనూ త్రిష కథానాయికగా కనిపించనుంది. త్రిషకు ఈమధ్య కాలంలో అంత మంచి విజయాలేమీ లేకపోయినప్పటికీ అవకాశాలకైతే కొదవలేదు. 30 ప్లస్‌లో ఉంటూ సరైన విజయాలు లేకున్నా ఇన్నేసి అవకాశాలు దక్కించుకోవడం అరుదైన విషయమే.