Search
Wednesday 21 November 2018
  • :
  • :

చిన్నారులతో ట్రంప్ సరదా ముచ్చట్లు

TRUMP

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవెల్ కార్యాలయంలో హాలోవెన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. విచిత్ర వేషధారణలతో చిన్నారులు ఈ వేడుకల్లో పాల్గొన్నార. తన టేబుల్ చుట్టూ చేరిన చిన్నారులతో జోకులు వేస్తూ ట్రంప్ వారిని నవ్వించారు. వైట్‌హౌస్‌లోని కిచెన్‌లో హాలోవెన్ థీమ్ కుకీను ట్రంప్ తయారు చేయించారు. వాటితో పాటు చాక్లెట్లు, బిస్కెట్లను ట్రంప్ చిన్నారులకు అందించారు. పెద్ద పెద్ద గుమ్మడి కాయల బొమ్మలు పెట్టి వాటిపై మాజీ అధ్యక్షులకు సంబంధించిన వివరాలను రాశారు. ఈ సందర్భంగా వైట్‌హౌజ్‌ను అందంగా అలంకరించారు.

Hallowen Celebrations at White house

Comments

comments