Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రష్మీ స్థానంలో హంసానందిని

Hamsanandiniయంగ్ హీరో రాజ్ తరుణ్ ‘కిట్టుగాడు ఉన్నాడు’ జాగ్రత్త అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకులకు నచ్చేస్తోంది. ఈ సినిమాలో కుక్కల కిడ్నాపర్‌గా రాజ్‌తరుణ్ కామెడీ పండించబోతున్నాడు. ఈ మూవీకి అదనపు అట్రాక్షన్‌గా ఓ ఐటమ్‌సాంగ్‌ను చేర్చాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించారు. ఈ ఐటమ్‌సాం గ్‌లో నటించే భామ కోసం ఎంతో వెతికారు. చివరకు ఈ ఛాన్స్ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్‌కు దక్కింద నే టాక్ వినిపించింది. అయితే హఠాత్తు గా ఇప్పుడు ఈ ఐటమ్‌సాంగ్‌లో హంసా నందిని నర్తించబోతోందని అంటున్నారు. టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో ఐటమ్‌సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది హాట్ బ్యూటీ హంసానందిని. అయితే రష్మీగౌతమ్‌ను తప్పించడం వెనుక రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడమేనని అంటున్నారు. ఇక రాజ్‌తరుణ్ పక్కన హంసానందిని అంటే చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఉంటుందిగా అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ పాటలో కేవలం హంస ఒక్కతే ఉంటుందట. రాజ్‌తరుణ్ ఈ పాటలో కనిపించడ ని తెలిసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించుకున్న ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నారు.

Comments

comments