Home తాజా వార్తలు మహిళా హాస్టళ్ల నిర్వహణ సాంఘిక సంక్షేమ బోర్డుకు అప్పగించండి

మహిళా హాస్టళ్ల నిర్వహణ సాంఘిక సంక్షేమ బోర్డుకు అప్పగించండి

Social Welfare Board chairperson Sujatha Yadav

 

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు, నిర్వహణను రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు అప్పగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ టర్కీని కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయనను కలిసిన రాగం సుజాత యాదవ్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నిర్భయ చట్టం కింద అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా చూడాలని కోరారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఒకేషనల్ ట్రైనింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన జిల్లాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని కుటుంబ సలహా కేంద్రాలను మంజూరు చేసి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు అభివృద్ధికి కృషి చేయాలని కోరగా, అజయ్ టర్కీ సానుకూలంగా స్పందించినట్లు ఆమె పేర్కొన్నారు.

Hand over Working Women Hostel to Social Welfare Board