Home తాజా వార్తలు రైతులకు వేసిన బేడీలపై దుమారం

రైతులకు వేసిన బేడీలపై దుమారం

ఖమ్మం: రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై దుమారం చెలరేగింది. పోలీసుల వైఖరిని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. సిఎం కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

Mirchi-raithu3

రైతులు ఏమైనా తీవ్రవాదులా అని టిపిసిసి నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంతకింత అనుభవించాల్సి ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు కన్నెర్ర చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు.

రైతులకు బేడీలు వేసిన ఘటనపై సిపి ఇక్బాల్ తక్విన్ స్పందించారు. రైతులకు బేడీలు వేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Mirchi-Farmers

ఖమ్మంలోని  మిర్చి మార్కెట్ పై దాడి చేసిన కేసులో పలువురు రైతులను పోలీసుల అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై గురువారం కోర్టులో విచారణ జరుగుతోంది.