Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పింఛన్ కోసం ఎస్‌ఐ వద్దకు

Handicaped

దహెగాం: పింఛన్ ఇప్పించాలని ఓ వికలాంగుడు ఠాణా మెట్లు ఎక్కిన సంఘటన కొమురం భీమ్ జిల్లాలో చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే.. దహెగాం మండలం భామనగర్ గ్రామానికి చెందిన గంగరాం వికలాంగుడు. అధికారులు సదరం క్యాంపులో 100 శాతం వికలాంగత్వం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినప్పటికీ తనకు వికలాం గ పెన్షన్ రావడం లేదని ఎస్‌ఐ రమేష్‌ను ఆశ్రయించాడు. ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తనకు ఎలాగైనా పింఛన్ వచ్చే విధంగా చూడాలని కోరాడు. ఈ విషయంపై స్పందించిన ఎస్‌ఐ రమేశ్ అధికారులతో మాట్లాడి పింఛన్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అనంతరం అతడికి దుప్పటి పంపిణీ చేశారు.

Comments

comments