Home తాజా వార్తలు చేనేత కార్మికుడి బలవన్మరణం

చేనేత కార్మికుడి బలవన్మరణం

SUICIDE

రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బివై నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే సత్తయ్య(55) శుక్రవారం రాత్రి కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పెళ్లికి చేసిన అప్పుల బాధతో బలవన్మరణాకి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.